మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో వాకిన్ అడ్మిషన్లు

మణుగూరు: మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వాకిన్ అడ్మిషన్ల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఓ. సారంగపాణి తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏటీసీలోని అన్ని ట్రేడ్లలోనూ ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు వచ్చి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కళాశాలకు వచ్చి వాకిన్ విధానంలో నేరుగా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 11 గంటల లోపు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

పినపాక నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన ట్రేడ్లలో ప్రవేశాలు పొందాలని ప్రిన్సిపాల్ సూచించారు. అడ్మిషన్ల కోసం iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు రావాలని తెలిపారు.

ఐటీఐలో సాంకేతిక విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సారంగపాణి కోరారు.

 

 

3Shares